'కెసిఆర్ శకుని, అశోక్ అర్జునుడు-చార్మినార్‌పై హక్కు'
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శకుని అని, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కర్ణుడు అని, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అర్జునుడు అని పలువురు వక్తలు బెజవాడ సభలో అన్నారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కృష్ణా జిల్లా విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఈ సభ జరిగింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వక్తల ప్రసంగం సాగింది.
అశోక్ బాబు మాట్లాడుతూ.. సభకు ప్రకృతి సహకరించకున్నా ప్రజలు తమ వైపే ఉన్నారని, జోరుగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా తరలి వచ్చారని, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పారు. విశాలాంధ్ర మహా సభ అధ్యక్షుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నలమోతు చక్రవర్తి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి యాభై ఏళ్ల చరిత్ర ఉంటే, తెలుగు జాతిని సమైక్యంగా ఉంచాలనే ఉద్యమానికి వందేళ్ల చరిత్ర ఉందన్నారు.

తెలుగు వాలే జాగో.. కెసిఆర్ బాగో ఆంటూ ఆయన నినాదం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కలియుగ కైకేయీ అన్నారు. గోల్కొండ శాసనాలు చూస్తే హైదరాబాదు ఎవడబ్బ సొత్తో తెలుస్తుందన్నారు. చార్మినార్, సాలార్‌జంగా మ్యూజియం పైనా తమకు హక్కుందని పలువురు వక్తలు చెప్పారు.
ఎవడో ఒకడు వచ్చి వేర్పాటు వాదం తెర మీదకు తీసుకొచ్చినప్పుడల్లా సీమాంధ్ర ప్రజలు పిల్లి కూనల్లా స్థలాలు మారడమే సరిపోతుందని, చంద్రగిరి రాజు తన తండ్రి చెన్నప్పనాయుడు పేరు మీద ఇప్పటి చెన్నై నగరాన్ని నిర్మించిన విషయం చరిత్రలో సాక్ష్యాలతో సహా ఉందని కానీ, ఆరోజు మద్రాసును తమిళ తంబిలకు వదిలి కర్నూలుకు వచ్చామని, అందరం కలిసి ఉందామని హైదరాబాద్‌కు రమ్మంటే అక్కడికి వెళ్లామని, రక్తమాంసాలను ధారపోసి అభివృద్ధి చేస్తే వేర్పాటు వాదులు ఒకరు వచ్చి పొమ్మంటే ఏ విజయవాడో, విజయనగరమో, ఒంగోలో వెళతామని, రేపు మళ్లీ అక్కడ కూడా మరో స్వార్థపరుడు వస్తే అప్పుడు ఎక్కడికి వెళ్లాలని కృష్ణా జిల్లా జెఏసి చైర్మన్ అన్నారు.












Click it and Unblock the Notifications