ఏపీలో ఎస్సీ వర్గీకరణ నిరసనలు హింసాత్మకం-పోలీసులపై ఎమ్మార్సీఎస్ రాళ్ల దాడులు?
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఏపీలో ఎమ్మార్పీఎస్ ఇవాళ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధానికి ఎమ్మార్పీఎస్ పిలుపు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నిరసనలు చేపట్టింది. వీటిని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ కోరుతూ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. రహదారిని దిగ్బంధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అనంతరం జిల్లాలోని జగ్గయ్యపేటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు మరోసారి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపైకి వారు రాళ్లు రువ్వారు.

జగ్గయ్యపేటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో జగయ్యపేటలో రోడ్డుపై మోహరించిన కార్యకర్తల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెనుగంచి ప్రోలు మండలం తోటచర్లలో వారు పోలీసులపై రాళ్ల దాడి చేశారు.












Click it and Unblock the Notifications