ఎపికి ఊరట: సిఆర్‌డిఎ చట్టంపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
పిటిషన్ విచారణకు వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించిన జస్టిస్ దత్తు - హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. తమ కంటే ఎక్కువ అధికారాలు హైకోర్టుకు ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ ఝా కల్పించుకొని వాదనలు వినడానికి సమయమివ్వాలని కోరగా, ధర్మాసనం అనుమతించింది. దాదాపు 20 నిమిషాల పాటు న్యాయవాది వాదనలు వినిపించారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి పునర్వ్యస్థీకరణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిందంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం పునర్వ్యస్థీకరణ చట్టంలో విధివిధానాలను రూపొందించిందని, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి భూసేకరమ చేసిందని, ఇది రాజ్యాం విరుద్ధమేనని మాజీ ఐఎఎస్ అధికారి దైవసహాయం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 3,4 అధికరణలను ఎపి ప్రభుత్వం అతిక్రమించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ వాదించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం శుభపరిణామమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో విజ్ఢప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా ఇక ముందు ఎవరూ భూసేకరణపై న్యాయస్థానాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications