బాబుకు ఊరట: భూసమీకరణ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. రాజధాని నిర్మాణంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. భూసమీకరణను వ్యతిరేకిస్తూ మాజీ జర్నలిస్టు శ్రీమన్నారాయణ పిటిషన్‌ దాఖలు చేశారు.

రాజధానికి సంబంధించి పర్యావరణాన్ని అంచనా వేయకుండా దీన్ని నిర్మిస్తున్నారంటూ పిటిషన్‌లో ప్రధానంగా అభిప్రాయపడ్డారు. దీనిపై విచారణన జరిపిన సుప్రీం కోర్టు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని ఎక్కడ నిర్మించాలనే దానిపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయలేదని దానిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

SC quashes petition filed against land pooling AP capital

మహానగరాల నిర్మాణం సమయంలో సమస్యలు సహజమని, ఒకరికి లాభం కలిగితే మరొకరికి నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణ అనుమతులు ప్రణాళిక దశలో అవసరం లేదని అన్నారు. పర్యవసానాలు అంచనా వేయకుండా ఎవరూ రాజధానిని నిర్మించరని సుప్రీం కోర్టు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు తెలిపారు.

నగర నిర్మాణానికి ఏం అనుమతులుంటాయని సుప్రీంకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. తాను హరిత ట్రిబ్యునల్‌లు వెళ్తానని శ్రీరామన్నారాయణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+