వంశీ అరెస్టులో బిగ్ ట్విస్ట్- ఉక్కిరి బిక్కిరి..!!
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పిం చారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు. వంశీ పైన ఒక మహిళ వేధింపులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ ఇక ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సంచలన విషయాలు
వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వంశీని విజయ వాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఉన్న ఆయన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడ భవానీపురం పీఎస్‌కు తరలించిన పోలీసులు అక్కడ నుంచి మరో వాహనంలో వంశీని కృష్ణలంక పీఎస్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించినట్లు కేసు నమోదు చేసారు. దీంతో వంశీ పైన కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ శ్రేణుల ఆందోళన
వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తో సహా పార్టీ నాయకులు ఆందోళ న చేపట్టారు. నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ తరలించారు. వంశీ భార్ యతో పాటుగా ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది. టీడీపీ కార్యాలయం కేసులో అక్కడి ఉద్యోగి సత్యవ ర్ధన్ కేసు ఉప సంహరించుకున్నారు. దీని వెనుక హైడ్రామా చోటు చేసుకుంది.
కిడ్నాప్ - బెదిరింపులు
వంశీ తో సహా మరో అయిదుగురు సత్యవర్దన్ ను బెదిరించి ఈ కేసు విత్ డ్రా చేసుకొనేలా ఒత్తిడి చేసారని అతని తల్లి, తండ్రులు ఫిర్యాదు చేసారు. సత్యవర్ధన్ పై దాడులకు తెగబడ్డాడని, కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు.












Click it and Unblock the Notifications