ఎందుకు ఉంచలేరు: మున్సిపల్ ఫలితాలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎక్కువ కాలం ఫలితాలు వెల్లడించకుండా ఉంచలేమని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే, ఎందుకు ఉంచలేరని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీలోగా కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

హైకోర్టు ఆదేశం మేరకు మున్సిపల్ కౌంటింగ్ తొమ్మిదో తేదిన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు గత బుధవారం విడుదల కావలసి ఉండగా, సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఫలితాలను నిలిపివేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదోపవాదనలు జరిగాయి. దీనిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
బుధవారం ఎన్నికలకు సంబంధించి ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసి కోర్టుకు తెలిపింది. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి ఆ షెడ్యూల్లో మార్పు చేయాలంటూ సుప్రీం కోర్టు సూచనల మేరకు వాదనలు విన్న హైకోర్టు 9వ తేదీ లోపల కౌంటింగ్, ఫలితాలు ప్రకటించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఫలితాలను ఎక్కువ కాలం వెల్లడించకుండా ఎందుకు ఉంచలేరని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications