తిరుపతి లడ్డు టోకెన్ల జారీలో స్కామ్: ఇంటి దొంగలే
తిరుపతి: తిరుమలలో లడ్డూ టోకెన్ల జారీలో భారీ కుంభకోణం చోటు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు టీటీడీ ప్రింటింగ్ ప్రెస్‌లో లడ్డూ టోకెన్లను అపహరించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మామూలుగా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రాయితీపై టీటీడీ రూ.20కి లడ్డూ టోకెన్లను, అలాగే నడకదారి భక్తులకు ఉచితంగా లడ్డూ టోకెన్లను అందజేస్తోంది. ఈ టోకెన్లను టీడీపీ తిరుపతిలో ఉన్న ప్రింటింగ్‌లో ముద్రించి ఆ పుస్తకాలను తిరుమలకు తరలిస్తోంది. అయితే టోకెన్లు ప్రింటింగ్ అయిన సమయంలో భారీగా పుస్తకాలను సిబ్బంది సహాయంతో కొందరు తస్కరించి భక్తులను విక్రయించారు.

టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారంనాడు లడ్డూలను తీసుకుంటున్న సమయంలో అనుమానం వచ్చిన అధికారులు టోకెన్లను పరిశీలించగా అవి తిరుమల నుంచి వచ్చినవి కాదని తేలింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు టోకెన్లను ప్రింటింగ్ ప్రెస్ నుంచి తస్కరించి విక్రయించినట్లు గుర్తించారు.
ఈ కుంభకోణం వెనుక ఎవరి హస్తం ఉన్నదనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. లోపలివారే ఈ కుంభకోణానికి పాల్పుడి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications