జగన్ Vs చంద్రబాబు, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు - తాజా సర్వే సంచలన రిపోర్ట్..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అధికారం నిలబెట్టుకోవటం లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అభ్యర్దుల మార్పులు, చేర్పులతో పోటీ చేసే వారి జాబితా ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అటు కాంగ్రెస్ తిరిగి పంజుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఏపీలో ప్రజల మూడ్ పైన తాజాగా సర్వే సంస్థ ఎవరికి ఎన్నిసీట్లు వస్తాయనే అంచనాలతో నివేదిక వెల్లడించింది.
ఏపీలో త్రిముఖ పోటీ : ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దమయ్యాయి. త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే స్కూల్ ఆప్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజల మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసింది. వైసీపీ సింగిల్ గా, టీడీపీ - జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను బయట పెట్టింది.

ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది. ఇప్పుడు ఏపీలో ఫలితాల పైన అంచనాలను ప్రకటించింది. ఏపీలో సీఎంగా జగన్ కు మంచి ఆదరణ ఉన్నా.. అధికారంలోకి మాత్రం టీడీపీ, జనసేన కూటమి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు : గతంలో చేసిన రాష్ట్రాల్లో తరహాలోనే ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నామని వివరించింది.ఈ సర్వే సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం ఏపీలో మూడు రీజియన్లుగా అంచనాలను వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాల్లో వైసీపీకి 12-16 వరకు వస్తాయ, టీడీపీ-జనసేన కూటమికి 18-22 వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది.
అదే విధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం 85 స్థానాల్లో వైసీపీకి 19-24 సీట్లు, టీడీపీ - జనసేన కూటిమికి 58-65 స్థానాలు వస్తాయని పేర్కొంది. రాయలసీమలో మొత్తం 55 స్థానాల్లో మెజార్టీ సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లడించింది. వైసీపీకి 36-40 సీట్లు, టీడీపీ - జనసేన కూటమికి 14-18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
@JaiTDP - @JanaSenaParty alliance set to win #AndhraElections2024 in spite of good approval rating for @ysjagan
— School of Politics (@_PoliticsSchool) January 9, 2024
After predicting Gujarat, Telangana, Rajasthan and Madhya Pradesh correctly 2-3 months well in advance, here is our prediction on #AndhraPradesh election pic.twitter.com/Zf4Ft6BVkM

కూటమి వైపే సర్వే మొగ్గు : ఈ లెక్కన మొత్తంగా వైసీపీకి 67-80 సీట్లు దక్కుతాయని పేర్కొంది. టీడీపీ, జనసేన కూటమికి 90-105 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించింది. దీని ద్వారా రాయలసీమలో అందరూ అంచనా వేస్తున్నట్లుగానే వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం..సీట్ల సర్దుబాట్లు..అభ్యర్దుల ఖరారు ఎన్నికల పైన ప్రభావం చూపనున్నాయి. అదే సమయంలో సంక్షేమం కేంద్రంగా ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో పార్టీల మేనిఫెస్టో..హామీలు కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications