కర్ణాటకలో గుంటూరువాసి హత్య, కారులోనే శవం: సొంత స్కూల్ పెట్టినందుకేనా?

బెంగళూరు: సొంతంగా స్కూల్ పెట్టిన వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసి శవాన్ని అతని కారులోనే దాచి పెట్టి పరారైన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని అవులహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హత్య చేసిన నిందితులు సాక్ష్యాలు చిక్కకుండా జాగ్రతలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన కే.ఎన్. రావ్ (43) అనే వ్యక్తి హత్యకు గురైనాడు. ఈయన మూడు సంవత్సరాల క్రితం బెంగళూరు గ్రామీణ జిల్లా హోసకోటే లోని నారాయణ (నారాయణ విద్యాసంస్థలు) స్కూల్ కు బదిలీ మీద వచ్చాడు.

తరువాత భార్య, ఆరు సంవత్సరాల కుమార్తె తో కలిసి బెంగళూరు నగర శివార్లలోని ఆవులహళ్ళిలోని లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. కొన్ని కారణాల వలన కే.ఎన్. రావ్ 8 నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తరువాత హోస కోటేలోనే అద్దె కట్టడం తీసుకుని మేధాశ్రీ ఒలింపియాడ్ స్కూల్ ను ప్రారంభించారు.

School owner Murdered in avalahalli near Bangalore

సోమవారం స్కూల్ దగ్గరకు వెళుతున్నానని భార్యకు చెప్పి అతని మారుతి షిఫ్ట్ కారులో ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు. రాత్రి 11.30 గంటలకు భార్య ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చెయ్యలేదని తెలిసింది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కే.ఎన్. రావ్ కారు అతని ఇంటి సమీపంలో నిలిపి ఉంది.

ఇంటి నుండి బయటకు వచ్చిన రావ్ భార్య నాంచారమ్మ కారును గుర్తించింది. ఇప్పుడే వచ్చినట్లు ఉన్నారని ఇంటికి వస్తారు లే అని 10 నిమిషాలు వేచి చూసింది. అయితే ఎంత సేపటికి రాకపోవడంతో ఆమె కారు దగ్గరకు వెళ్లి చూసింది.

రావ్ తల మీద ఇనుపరాడ్ లతో దాడి చేసి గొంతు బిగించి దారుణంగా హత్య చేసిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రావ్ ను హత్య చేసి అతని కారులోనే శవాన్ని పెట్టి పరారైనారని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రమేష్ అన్నారు. కొత్తగా స్కూల్ పెట్టినప్పటి నుండి బెదిరింపు ఫోన్ లు వస్తున్నాయని రావ్ భార్యా పోలీసులకు చెప్పింది.

తమకు గతంలో ఎవరు శత్రువులు లేరని, ఉద్యోగం వదిలేసినప్పటి నుండి వేధింపులు చేశారని, తరువాత స్కూల్ పెట్టినప్పటి నుండి బెదిరింపు ఫోన్ లు ఎక్కువ అయ్యాయని రావ్ భార్య సమాచారం ఇచ్చారని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+