బాలికపై పాస్టర్ అత్యాచారం: ప్రేమోన్మాది మల్లేష్ ఆత్మహత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు కె. జయరాజ్ పార్ట్ టైమ్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. పాలపట్టి గ్రామంలోని సెయింట్ మార్క్స్ చిల్డన్స్ హోం వార్డెన్‌గా కూడా పనిచేస్తున్నాడు.
వసతి గృహంలో 13 మంది అమ్మాయిలు, 17 మంది అబ్బాయిలు ఉంటున్నారు. వారంతా సమీపంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారు. జ్వరంతో బాధపడుతూ అమ్మాయి వసతిగృహానికి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయరాజ్ నెలకు రెండు సార్లు అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. అతను పరారీలో ఉన్నాడు.

పెళ్లి చేసుకొనేందుకు ఒప్పుకోకపోవడంతో ఉన్మాదిగా మారి యువతిని హత్య చేసిన మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం బెక్కెం గ్రామానికి చెందిన నాగమణిని హత్య చేసిన మల్లేశ్ ఆ తర్వాత గ్రామ శివారులోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం బావి ఒడ్డున అతడి పంచె కన్పించడంతో గ్రామస్థులు అనుమానించారు. గురువారం బావిలో కొండ్లు వేసి గాలించగా మల్లేశ్ మృతదేహం బయటపడింది.












Click it and Unblock the Notifications