Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో కొత్తగా 26 రైళ్లకు హాల్ట్ లు-వివరాలివే..!

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటి వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో 26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి.

భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) ను ఈ నెల 4 నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో ఆపబోతున్నారు. అలాగే నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17232) ను కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో నిన్నటి నుంచి ఆపుతున్నారు. హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5నుంచి ఆపనున్నారు. అలాగే ఎర్నాకుళం-పాట్నా ఎక్స్ ప్రెస్ (22669)ను ఈ నెల 5 నుంచి ఖమ్మంలో ఆపబోతున్నారు. బీదర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (17009)ని మర్పల్లిలో ఇవాళ్టి నుంచి హాల్ట్ ఇస్తున్నారు.

scr announces new experimental stoppages to 26 trains in these stations in ap Telangana

అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (23655)ను నిన్నటి నుంచి పెద్దపల్లిలో ఆపుతున్నారు. అలాగే సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (10705) రైళ్లను ఇవాళ్టి నుంచి నెక్కొండలో ఆపుతున్నారు. చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) రైలుకు ఈ నెల 8 నుంచి వరంగల్ లో హాల్ట్ ఇచ్చారు. అలాగే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలుకు నిన్నటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో స్టాపులు ఇచ్చారు.

అటు తిరుపతి-లింగంపల్లి (12733) రైలును నిన్నటి నుంచి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో ఆపుతున్నారు. అలాగే నరసాపురం-లింగంపల్లి (17255) రైలును నిన్నటి నుంచి నల్గొండలో ఆపుతున్నారు. లింగంపల్లి-నరసాపూర్ (17256) రైలును నిన్నటి నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు. పూరీ-తిరుపతి (17479), బిలాస్ పూర్ -తిరుపతి(17481), తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైళ్లను నిన్నటి నుంచి చిన్న గంజాంలో ఆపుతున్నారు.

scr announces new experimental stoppages to 26 trains in these stations in ap Telangana

గుంటూరు -రాయగడ(17243) రైలుకు నిన్నటి నుంచి భీమడోలులో హాల్ట్ ఇస్తున్నారు. గుంటూరు -నరసాపురం (17281) రైలుకు పుట్లచెరువులో హాల్ట్ ఇస్తున్నారు. ఎర్నాకుళం-బరౌనీ(12522) రైలును ఈ నెల 7 నుంచి చీరాలలో హాల్ట్ ఇస్తున్నారు. విశాఖ-సికింద్రాబాద్(20833), సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) రైళ్లకు నిన్నటి నుంచి సామర్ల కోటలో హాల్ట్ ఇస్తున్నారు. చెంగల్ పట్టు-కాకినాడ పోర్టు (17643) రైలును ఇవాళ్టి నుంచి కొత్త గుంటూరు స్టేషన్లో హాల్ట్ ఇస్తున్నారు. ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలుకు నిన్నటి నుంచి మార్కాపురం రోడ్, గిద్దలూరులో హాల్ట్ ఇస్తున్నారు. కాచిగూడ-రేపల్లె (17625), యశ్వంత్ పూర్-మచిలీపట్నం (17212) రైలుకు ఇవాళ్టి నుంచి కంభంలో హాల్ట్ ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+