తిరుపతి సహా ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు - ప్రధాన రైళ్లకు అదనపు బోగీలు..!!
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల కొనసాగింపుతో పాటుగా పలు రైళ్లను అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వచ్చ ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రధాన రైళ్లల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ తాజా గా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు ప్రతి శనివారం సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. నర్సాపూర్-చర్లపల్లి (07234) రైలు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకోనుంది. ఇక, జాల్నా-తిరుపతి (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం అందుబాటులో ఉంటుందని.. జాల్నా స్టేషన్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతికి చేరుతుందని అధికారులు వెల్లడించారు.

అదే విధంగా తిరుపతి-జాల్నా రైలు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 3.50 గంటలకు గమ్యస్థానం చేరుతుందని వివరించింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయ వాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరసవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది. జాల్నా-తిరుపతి-జాల్నా రైలు పార్తూర్, సేలు, మన్వత్‌రోడ్, పర్బణి, గాంఖేర్, పర్లి వైద్యనాథ్, లాథూర్ రోడ్, ఉద్గిర్, బీదర్, మార్పల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చిరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
మరో కీలక నిర్ణయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. విశాఖ- భువనేశ్వర్- విశాఖ... విశాఖపట్నం-బ్రహ్మపుర- విశాఖపట్నం... విశాఖ-కొరాపుట్- విశాఖ... ఇంటర్ సిటీ రైళ్లకు రెండు జనరల్, రెండు సెకండ్ క్లాస్ సిటింగ్ బోగీలు జత చేశారు. అలాగే విశాఖ-భవానీ పట్నం-విశాఖ... విశాఖ-గుణపూర్-విశాఖ... విశాఖ-రాయపూర్- విశాఖ... విశాఖ-కొరాపుట్-విశాఖ రైళ్లకు ఒక జనరల్ సెకండ్‌క్లాస్ బోగీ జత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications