తెనాలి వైపు రైల్లో వెళ్తున్నారా ? ఇది మీ కోసమే..!

తెనాలి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ అలర్ట్ జారీ చేసింది. తెనాలి జంక్షన్ లోని యార్డ్ లో ఆధునీకీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అటువైపు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు సమయాల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తెనాలివైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాలని అధికారులు కోరారు.

తెనాలి జంక్షన్ మీదుగా వెళ్లే గూడూరు-కృష్ణా కెనాల్ జంక్షన్ మూడో లైన్ నిర్మాణం కారణంగా తెనాలి రోడ్ నంబర్ 2ను ఇవాళ్టి నుచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీని వల్ల మూడు రైళ్లను ఇవాళ, రేపు రద్దు చేశారు. వీటిలో విజయవాడ-తెనాలి( 67221), తెనాలి-రేపల్లె(67231), రేపల్లె-తెనాలి (67332)రైళ్లు ఉన్నాయి. అలాగే తెనాలి-రేపల్లె మధ్య నడిచే మరో రైలు (67224)ను ఇవాళ, రేపు గంట ఆలస్యంగా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

SCR cancel or reschedule these trains running via tenali junction on feb 12 13 due to yard works

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్త రైల్వే ట్రాక్ ల నిర్మాణంతో పాటు యార్డ్ ల ఆధునీకరణ, స్టేషన్ల సుందరీకరణ వంటి పలు పనులు చేపడుతున్నారు. వీటి కారణంగా అధికారులు ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. వీటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు దీన్ని తెలుసుకుని రాకపోకలు సాగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ, రేపు తెనాలి జంక్షన్ మీదుగా రేపల్లె, విజయవాడ, చెన్నై వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాలని కోరారు.

SCR cancel or reschedule these trains running via tenali junction on feb 12 13 due to yard works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+