నెహ్రూ జూపార్కులోకి రెండు సీ హార్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలకు రెండు కొత్త అతిథులు వచ్చాయి. అరుదైన రెండు సీ హార్స్ చేపలు (నీటి గుర్రం చేపలు) సందర్శకులకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో కనువిందు చేయనున్నాయి. ఆడ, మగ సీ హార్స్ చేపలను అధికారులు మంగళవారం అక్వేరియంలోకి విడుదల చేశారు.
సీ హార్స్ చేపలు సాధారణ చేపల కన్నా నెమ్మదిగా ఈదుతాయి. ఆ సీ హార్స్ చేప ఏడాదికి 300 నుంచి 1000 వరకు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లను మగ చేప పొదిగి పిల్లలను పెడుతుంది. మగ చేపకు కడపు భాగంలో సంచీ వంటిది ఉంటుందని, ఆడ చేప గుడ్లు పెడితే మగ చే పొదుగుతుందని జూ అధికారులు చెప్పారు.
సీ హార్స్ చేపలు చాలా అరుదైవని, జూపార్కులో మొదటిసారి వీటిని అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర జూపార్కుల డైరెక్టర్ పి. మల్లి కార్జునరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యూరేటర్ బిఎన్ఎస్ మూర్త, ఎసీఎఫ్ శామ్యూల్, ప్రజా సంబంధాల అధికారి హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

జూ పార్కులో సీ హార్స్
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో సందర్శకులకు అరుదైన సీ హార్స్ చేపలు అందుబాటులోకి వచ్చాయి. రెండు సీ హార్స్ చేపలు అక్వేరియంలో కను విందు చేస్తున్నాయి.

కోతి తోకలాగా..
సీ హార్స్ చేపల తోక కోతి తోకలాగా ఉంటుంది. దాంతో ఇవి సాధారణ చేప కన్నా నెమ్మదిగా నీటిలో ఈదుతాయి.

ఆడా, మగా చేపలు..
నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు అక్వేరియంలో విడుదల చేసిన సీ హార్స్ చేపల్లో ఒకటి ఆడది కాగా, మరోటి మగది.

మగ చేపనే పిల్లలను పెడుతుంది...
ఆడ చేప గుడ్లు పెడితే మగ చేప పొదిగి పిల్లలను చేస్తుంది. మగ చేప కడుపు భాగాన సంచీ వంటిది ఉంటుంది. దాంతో అది పిల్లలను పొదుగుతుంది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications