అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో రేపటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌- ఈ మూడు శాఖల సిబ్బందికి..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఈసారి వ్యాక్సినేషన్‌లో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూశాఖల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 89వేల 100 మంది పోలీస్ సిబ్బంది, లక్షా 55వేల మంది మున్సిపల్, 3లక్షల 32వేల మంది రెవెన్యూ సిబ్బంది పేర్లు కోవిన్ యాప్ లో రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16లక్షల 31వేల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు.

రెండో విడత వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కోవిన్‌ యాప్‌లో 5.9 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. మొదటివిడతలో 3.88 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని లక్ష్గంగా పెట్టుకున్నా కేవలం లక్షా 89 వేల మందికే ఇవ్వగలిగారు. రెండో విడతలో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోగ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. రెండో విడత వ్యాక్సినేషన్ కోసం 3181 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిలో కొన్ని సందేహాలు ఉన్నాయని, అందుకే వ్యాక్సిన్లు వేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాక తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కేసు వారీగా అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

second phase covid vaccination drive in andhra pradesh from tomorrow,

Recommended Video

Atchannaidu Arrest : కింజ‌రపు కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు : ఎంపీ Rammohan Naidu

ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత చనిపోయిన ఆశావర్కర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం అందించింది. ఆమె మరణానికి సంబంధించిన పూర్తి పోస్టమార్టం నివేదిక ఆరోగ్యశాఖకు అందాల్సి ఉందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్నాక అనారోగ్యానికి గురైన ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు ధనలక్ష్మికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించేందుకు ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించామన్నారు.

English summary
andhra pradesh government has planned for second phase covid 19 vaccination drive from tomorrow across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X