'జగన్-బాబుల మధ్య రహస్య అజెండా', '2019లో వైసీపీ, జగన్ పరిస్థితి ఇదీ'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష వైసిపి నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువురికి లంకెపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా, పరువుపోయింది: బాబు, మోడీపై అసహనం

జగన్, చంద్రబాబుల మధ్య రహస్య అజెండా

జగన్, చంద్రబాబుల మధ్య రహస్య అజెండా

చంద్రబాబు, జగన్‌ల మధ్య రహస్య అజెండా సాగుతుందని రఘువీరా వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, పాదయాత్రపై ఆయనకే స్పష్టత లేదన్నారు. అసెంబ్లీని బహిష్కరించడం వైసీపీ బాధ్యతారాహిత్యమన్నారు.

2019లో గెలుపు మాదే

2019లో గెలుపు మాదే

2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని రఘువీరా అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా జగన్, చంద్రబాబులు ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే

జగన్ ముఖ్యమంత్రి అయితే

జగన్ సీఎం అయితే ఆయన ఆస్తులు పెరుగుతాయి తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కడపలో అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయన్నారు. పారడైజ్ పత్రిక నల్లకుబేరుల జాబితాలో జగన్ పేరు ఉందని విమర్శించారు.

2019లో ఇదీ జగన్ పరిస్థితి

2019లో ఇదీ జగన్ పరిస్థితి

జగన్ ఆరాటమంతా ముఖ్యమంత్రి కుర్చీ కోసమేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం మండిపడ్డారు. జగన్‌కు పిచ్చిపట్టి పాదయాత్ర చేస్తున్నారన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలే మిగులుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Congress chief Raghuveera Reddy on Saturday said that there is a secret agenda between AP CM Nara Chandrababu Naidu and YSRCP chief YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి