సికింద్రాబాద్-శ్రీకాకుళం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ వేసవిలో తెలంగాణలోని సికింద్రాబాద్ (secunderabad)నుంచి ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam)మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ రెండు స్టేషన్ల మధ్య ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో 13 అప్ రైళ్లు, మరో 13 డౌన్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు ఏయే తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి, హాల్ట్ లు, ఇతర వివరాలను అధికారులు ఇవాళ వెల్లడించారు.

సికింద్రాబాద్ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.15కు ప్రత్యేక రైలు (నంబర్ 07425)ను శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకూ నడపనున్నారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్ కు సోమవారం సాయంత్రం 5.30కు చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతీ సోమవారం సాయంత్రం 7.30కు బయలురేదే మరో ప్రత్యేక రైలు (నంబర్ 07426) సికింద్రాబాద్ స్టేషన్ కు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో, మే 4, 11, 18, 18, 25 తేదీల్లో, జూన్ 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

Secunderabad-Srikakulam Road South Central Railway Adds Summer Special Trains

ఈ రెండు వైపులా ప్రత్యేక రైళ్లకూ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఎలమంచిల్లి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లె స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాబట్టి వేసవిలో రెండు తెలుగు రాష్టాల మధ్య ప్రయాణాలు చేసే వారు వీటిని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+