విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వందేభారత్' ఎవరి కోసం?

|
Google Oneindia TeluguNews

వందే భారత్, వందే భారత్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలు రెండురోజులుగా హోరెత్తిపోతున్నాయి. 130 కిలోమీటర్ల వేగంతో అత్యంత ఫాస్ట్ గా గమ్యానికి చేరుస్తుందంటూ రైల్వే శాఖ ప్రకటించింది. దేశ ప్రధానమంత్రితోపాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్... అందరూ పండగవేళ ఒక రైలు గురించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన పండగ వచ్చిందని ప్రధానమంత్రి అభివర్ణించారు.

సామాన్యులకు అందుబాటులో ఉందా?

సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో కొత్త వందే భారత్ ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.905 ఛార్జీ ఉంది. సాధారణంగా సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో దీని ధర రూ.172గా ఉంది. గమ్యస్థానానికి ఆరుగంటల్లో చేరుస్తోంది. వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల సమయం పడుతోంది. ఇతర రైళ్లకు, వందే భారత్ కు తేడా కేవలం రెండు గంటలు. ఆ రెండుగంటల సమయం కోసం అదనంగా రూ.725 ఖర్చుపెట్టడం అవసరమా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. రైలు లోపల ఇంటీరియర్ డెకరేషన్ బాగున్నంత మాత్రాన అంత వెచ్చించాలా? కేవలం వందే భారత్ అనేది ధనవంతుల కోసమే ప్రవేశపెట్టిన రైలుగా మజ్దూర్ సంఘ్ నాయకులు అభివర్ణిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3170


సికింద్రాబాద్ లో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అలాగే విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న 699 కిలోమీటర్ల దూరం 8.30 గంటల సమయం పడుతోంది. విశాఖ నుంచి 3170సికింద్రాబాద్ మధ్య ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 3170గా ఉంది. చైర్ కార్ ధర రూ.1720గా ఉంది. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్ల ధరలు రూ.257గా ఉన్నాయి. అదే స్లీపర్ అయితే రూ.427గా ఉంది. దర్జాగా పడుకొని రావచ్చు.

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలేమయ్యాయి?

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17 వందే భారత్ లు ప్రారంభించగా, 18వదిగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రారంభమైంది. వర్చువల్ గా ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రారంభించారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో పార్లమెంటు సాక్షిగా చేస్తామన్న హామీలన్నీ రైలుపట్టాలమీదే కొట్టుకుపోయాయి. తెలంగాణకన్నా ఏపీ మరింతగా ఇబ్బంది పడుతోంది. తర్వాత అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఏమేరకు ఏపీని ఆదుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే.

English summary
Vande Bharat, Vande Bharat, two Telugu states are shouting for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X