జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి - ఆ వెంటనే..!! (వీడియో)
మాజీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటన కోసం జగన్ కడపకు వెళ్లారు. ఈ నెల 8న ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ జన్మదినం నాడు నివాళి అర్పించనున్నారు. కడప చేరుకున్న జగన్ వేంపల్లెలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించారు. ఆ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి జగన్ వద్దకు దూసుకొచ్చారు.
వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పు చేస్తున్నారు. ఈ నెల 8న ఇడుపులపాయలో పార్టీ ప్రక్షాళన కు మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల తరువాత జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు కొనసాగితే రియాక్షన్ తప్పక ఉంటుందని జగన్ హెచ్చరించారు. ఇదే సమయంలో పార్టీలో కీలక నియమకాల పైన ఫోకస్ చేసారు.

తాజాగా కడపలో జగన్ పర్యటిస్తున్నారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డగించి, పక్కకు తీసుకెళ్లారు. అయితే, ఆ వ్యక్తి తాను జగన్ మీద అభిమానంతోనే..సెల్ఫీ తీసుకొనేందుకు వచ్చానని చెప్పారు.
జగన్ పైకి దూసుకు వచ్చిన వ్యక్తి. భద్రత సిబ్బంది అలర్ట్..!#YSJagan #Jagan #YSRCP #AndhraPradesh #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/Ouu0vS2qnd
— oneindiatelugu (@oneindiatelugu) July 7, 2024
జగన్ వెంటనే ఆ వ్యక్తిని వదిలేయాలని సూచించారు. తాజాగా రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ ఆ వ్యక్తి వేగంగా జగన్ వద్దకు దూసుకురావటంతో ఆందోళన కనిపించింది. అయితే, సెల్ఫీ కోసమే వచ్చినట్లు చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications