తొలగించారు: మొన్న సెక్యూరిటీ, ఈరోజు ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగు చూసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఎవరినీ నమ్మడం లేదని, పార్టీలోని నాయకులను కూడా అనుమానంతో చూస్తున్నారని సమాచారం.
ఇటీవలే తన నివాసం వద్ద భద్రతా సిబ్బందిని మార్చివేసిన చంద్రబాబు, ఇప్పుడు ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించినట్టు తెలుస్తోంది. తొలగించిన వారి జాబితాలో పని మనుషులు నుంచి కారు డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరిలో కొంత మంది చంద్రబాబు ఇంట్లో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు.

ముఖ్య సమాచారం లీకవుతుందనే ఉద్దేశ్యంతోనే కింది స్ధాయి సిబ్బందిని మార్చినట్టు తెలుస్తోంది. ఇంటి వద్ద భద్రతా పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అదే విధంగా గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ సిబ్బందిలోనూ సమూల మార్పులు చేశారు.
గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష
గోదావరి పుష్కరాలపై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పుష్కర ఏర్పాట్లపై సీఎంకు వివరించారు. మొత్తం రూ.1,295 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ.244.15 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు తెలిపారు.
పుష్కర ఘాట్ల వద్ద 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇక, రాజమండ్రిలో 1600 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మహిళలకు ప్రత్యేక గదులు నిర్మించాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications