డొక్కు వాహనాల్లో జగన్-కనిపించని పోలీసులు-వైసీపీ ఫైర్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు ఇవాళ చేపట్టిన టూర్ లో భద్రతా లోపాలు కనిపించాయి.
ముఖ్యంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు దగ్గర పోలీసు సిబ్బంది కనిపించలేదని తెలిపింది. వైఎస్ జగన్‌కు శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వక కుట్ర చేస్తున్నారంటూ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
శాంతిభద్రతల ఆందోళనలు సృష్టిస్తూ రైతుల గొంతులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. భద్రతను తీసివేయడం అనేది సమస్యలను సృష్టించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం అన్నారు. ప్రభుత్వ తీరు అత్యంత అరాచకంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గిస్తోందని అంబటి గుర్తుచేశారు.

ఇవాళ జగన్ టూర్ కు అరిగిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చారని అంబటి ఆరోపించారు. సమీక్ష కూడా నిర్వహించకుండా భద్రతను తగ్గించారన్నారు. జగన్ జిల్లా పర్యటనల్లోనూ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, కానీ తాము ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తుచేశారు. అలాగే ప్రచారం కూడా చేయట్లేదన్నారు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదన్నారు.
పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చి తీరాల్సిందేనని అంబటి తెలిపారు. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇబ్బంది పెడితే వాళ్లే ఇబ్బంది పడతారన్నారు. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. మిర్చి ధర సగానికి సగం పడిపోయింది మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ వస్తున్నారని, ఈ ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని అంబటి ఆరోపించారు. తమ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేని పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు.
-
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications