మళ్లీ గెలిచి విభజించు: కాంగ్‌కు లగడపాటి, ప్రణబ్‌పై ఆశ

ఆనవాయితీ ప్రకారం, పాత సంప్రదాయాల ప్రకారం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగాను, తర్వాత పార్లమెంటులోనూ కేంద్ర మంత్రి చిదంబరం మాట్లాడుతూ ఆనవాయితీ ప్రకారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారన్నారు. అలాగే, చిన్న రాష్ట్రాల సమస్యను ఎస్సార్సీ ద్వారానే పరిష్కరించాలని గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిందని, ఆ నివేదిక ఇచ్చింది ప్రణబ్ ముఖర్జీయేనని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తీర్మానాన్ని అసెంబ్లీకి పంపించకుండా ఏకపక్షంగా ముందుకు వెళితే గత హామీలను తుంగలో తొక్కినట్లేనని, మాట తప్పినట్లేనని అన్నారు. అలాగే, తీర్మానాన్ని అసెంబ్లీ వ్యతిరేకిస్తే ఆ మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని, విభజనలో కీలక వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన్ను కలుస్తున్నామన్నారు. పద్ధతులు పాటించకుండా రాష్ట్ర విభజనను ఏకపక్షంగా చేస్తే మరో ఇరవై నాలుగు రాష్ట్రాలకు డిమాండ్లు వస్తాయని, దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పారు.
రాష్ట్రపతి రాష్ట్ర సమైక్యతకు దోహదపడతాడన్న ఉద్దేశ్యంతోనే ఆయనను కలుస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజనను ఎస్సార్సీ ద్వారా చేస్తామని, రోశయ్య కమిటీని వేసి ఆ నివేదిక ఆధారంగా చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొని ప్రజల అనుమతి పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని కాలరాయడం సరికాదన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించదల్చుకుంటే మళ్లీ ఎన్నికల ప్రణాళికలో ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొని, ఎన్నికల్లో విజయం సాధించి చేయొచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతమే చెల్లుబాటవుతుందని, నేరచరితులను రక్షించే ఆర్డినెన్స్‌ను చించేసినట్లే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను కూడా చించేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications