కేంద్రాన్ని పక్కన పెట్టండి: బస్సులో వెళ్లి మొర (పిక్చర్స్)
హైదరాబాద్: విభజనపై కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని, కేంద్రాన్ని పక్కన పెట్టి స్వతంత్రంగా వ్యవహరించాలని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో పద్ధతులు, సంప్రదాయాలను రాజ్యాంగ ఆర్టికళ్లు, నిబంధనలు, శాసనాలతో సమానంగా పరిగణిస్తామని కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, గత సంప్రదాయాలను, పద్ధతులను పక్కన పెడుతోందని రాష్ట్రపతికి సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఫోరం ఫిర్యాదు చేసింది.
రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందేనని, బిల్లు కూడా అసెంబ్లీకి రావాలని కోరింది. ఫోరం కన్వీనర్, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీల బృందం గురువారం రాత్రి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి తీర్మానాన్ని, ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపించాలని కోరింది.
ఈ మేరకు అంతా సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించింది. అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో శైలజానాథ్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మంత్రి టిజి వెంకటేశ్ రాష్ట్రపతికి పలు అంశాలను వివరించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవటం లేదని తెలిపారు.
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరు, ప్రాంతం, సరిహద్దులను ప్రభావితం చేసే ఏ బిల్లును అయినా రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపించాలని, ఆయన ఆమోదించిన గడువులోపు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదని వెల్లడించారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలు, చట్టసభల పద్ధతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ, సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరామని మంత్రి శైలజానాథ్ చెప్పారు.

మీడియాతో
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలు, చట్టసభల పద్ధతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ, సీమాంధ్ర ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరామని మంత్రి శైలజానాథ్ చెప్పారు.

బస్సులో
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యేందుకు బస్సులో వెళ్లారు. ప్రణబ్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు.

డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీలో తెలగ, బలిజ తదితర కమ్యూనిటీలకు బిసి స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ వర్గాలు.

ప్రణబ్‌తో
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర సమైక్యత భారాన్ని వారు ప్రణబ్ పైనే వేశారు.












Click it and Unblock the Notifications