సీమాంధ్రులు హైదరాబాదును నాశనం చేశారు: కెసిఆర్

మెదక్: రాష్ట్ర రాజధాని హైదరాబాదును సీమాంధ్రులు నాశనం చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. సిద్దిపేటలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధనలో ఓ అంకం పూర్తయిందన్నారు.

తెలంగాణ గొప్ప రాష్ట్రంగా అయ్యే వరకు తెరాస పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికే తెలంగాణను సాదిద్దామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాత్ర పోషిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. అవసరమైతే వారు తరఫున పోరాటం చేస్తామన్నారు. పేదల కళ్లలో చిరునవ్వు చూసే వరకు పోరాడుతానన్నారు.

KCR

తెలంగాణ సాధనలో ఓ అంకం పూర్తయిందన్నారు. ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తాను తీర్చుకోలేనని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిద్దిపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు వంద కిలోమీటర్ల దూరంలో టౌన్‌షిప్ వస్తుందని, హైదరాబాదులో ఏ పెళ్లికి వెళ్లాలన్న గంటల ట్రాఫిక్‌తో గందరగోళం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డిలు అనుకోవడం అవివేకమని సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ వేరుగా అన్నారు. విభజనను ఆపేందుకు జగన్, బాబులు రాష్ట్రపతిని కలువాలనుకోవడం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న దానిని ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి గౌరవిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+