వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరానికి ప్రణబ్ ముఖర్జీ: ఆయన పైనే ఆఖరి ఆశలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ, కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని అభిప్రాయపడుతున్న ఆయా పార్టీలకు చెందిన సీమాంధ్ర రాజకీయ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రణబ్ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. దీంతో ఆయనను కలిసి విజ్ఞప్తులు అందించేందుకు సీమాంధ్ర నాయకులు సిద్ధంగా ఉన్నారు.

సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖలోని అంశాలను ప్రణబ్ వద్ద ప్రస్తావించనున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా వేర్వేరుగా అపాయింటుమెంటు కోరాయి.

మరోవైపు ప్రణబ్ పర్యటన కారణంగా సోమ, మంగళవారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

సోమవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు రాజ్ భవన్ ప్రాంతం వైపుకు రాత్రి 7.25గంటల నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మంగళవారం ఉదయం 9.10గంటల నుంచి 10.10గంటల వరకు రాజ్ భవన్ నుండి జాతీయ పోలీసు అకాడమీ వరకు, మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.15గంటల వరకు జాతీయ పోలీసుల అకాడమీ నుండి ఎయిర్ పోర్టు వై జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

English summary
Seemandhra Congress leaders last hope on President Pranab Mukherjee on AP division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X