హైదరాబాదుపై కేంద్రమంత్రుల పట్టు, విభేదించిన కిషోర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల బృందం(జివోఎం) ముందు హాజరైన సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు హైదరాబాదు కోసం పట్టుబట్టారు. జివోఎంతో కేంద్రమంత్రులు భేటీ అనంతరం జెడి శీలం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము సమైక్య రాష్ట్రం కోసం భేటీలో డిమాండ్ చేశామన్నారు. తమ మొదటి ప్రాధాన్యత సమైక్యమే అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే వచ్చే ఇబ్బందులను తాము జివోఎం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. విభజన అనివార్యమైన పక్షంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని తాము కోరామన్నారు. పదకొండు అంశాల గురించి వారికి వివరించామన్నారు. గోదావరి నది నీటిని సద్వినియోగం చేసుకుంటే ఐదు రాష్ట్రాలకు నీరు అందుతుందన్నారు.

హైదరాబాదే
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ముప్పై లక్షల మంది సీమాంధ్రులు స్థిరపడ్డారని చెప్పారు. విభజన తప్పనిసరి అయితే హైదరాబాదును పుదుచ్చేరి తరహా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాదుతో సీమాంధ్రులకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. హెచ్ఎండియే పరిధిని యూటిగా చేయాలన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని, అలాంటి నగరం అందరిదీ అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వారికి వినిపించామన్నారు. జివోఎంతో భేటీ అనంతరం తమకు కొంత నమ్మకం వచ్చిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తారనే విశ్వాసం జెడి శీలం వ్యక్తం చేశారు. హైదరాబాదు చుట్టు అభివృద్ధి కేంద్రీకృతమై ఉందన్నారు. జివోఎం తమ మాట వింటుందనే నమ్మకం ఉందన్నారు.
విభేదించిన కిషోర్ చంద్రదేవ్
సీమాంధ్ర కేంద్రమంత్రులు హైదరాబాదు కోసం పట్టుబడుతుండగా మరో కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ మాత్రం జివోఎం భేటీలో వారితో విభేదించారు. విశాఖ అరవై ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, విభజన తర్వాత విశాఖను సీమాంధ్రకు రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖకు రాజధాని అయ్యే అర్హత ఉందన్నారు. 1953లో జస్టిస్ వాంచూ కమిషన్ అదే నివేదిక ఇచ్చిందన్నారు.
1973లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఇరవై తొమ్మిదవేల ఎకరాలు సేకరించారని, అందులో తొమ్మిదివేల ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఆర్థిక మండలి కోసం మరో తమ్మిదివేల ఎకరాలు సేకరించారని, ఈ పద్దెనిమిది వేల ఎకరాలలో పరిపాలనా భవనాలు నిర్మించుకోవచ్చునన్నారు. తక్షణమే భవనాలను అద్దెకు తీసుకొని పాలన సాగించవచ్చునన్నారు. విశాఖకు దగ్గరగా ఉన్న ఇథర పట్టణాల్లో పాలనా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు.
రాయలసీమ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రతో కలిసి ఉండేందుకు సిద్ధంగా లేరన్నారు. వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి లేదా తెలంగాణ ప్రాంతంలో కలపాలన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఆదాయాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (సీమాంధ్ర) 25 అయిదేళ్లు ఇవ్వాలన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications