Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ నూతన సీఎస్ గా - చంద్రబాబు అనూహ్య ఎంపిక..!?

ఏపీకి కొత్త సీఎస్ దాదాపు ఖరారయ్యారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం పై సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారు. ప్రస్తుత సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. నీరభ్ కు ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతలు అప్ప గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్ గా ఎంపిక వేళ పలువురు సీనియర్ల పేర్లు రేసులోకి వచ్చాయి. కానీ, సీనియారిటీ ప్రాతిపదికన సాయి ప్రసాద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చంద్రబాబు కసరత్తు
ఏపీకి కొత్త సీఎస్ నియామకం పైన చంద్రబాబు అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తరువాత సీనియార్టీ మేరకు ఎనిమిది మంది ఐఏఎస్ జాబి తా లో ఉన్నారు. సీనియార్టీ లో శ్రీలక్ష్మీ ముందు వరుసలో ఉన్నా.. ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వక పోవ టం తో సీఎస్ గా ఛాన్స్ కనిపించటం లేదు. ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఉన్నారు.

Senior IAS Sai Prasad Chances to appoint as new Chief Secretary of AP as reports

రేసులో సీనియర్లు
శ్రీలక్ష్మీతో పాటుగా అజయ్ జైన్ కు అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాల సమాచారం. కేంద్ర సర్వీసు ల్లో ఉన్న సుమిత దావ్రా ఏపీకి వచ్చేందుకు సుముఖంగా లేరు. దీంతో, ఇప్పుడు 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులుగా ఉన్న సాయిప్రసాద్‌, ఆర్పీ సిసోదియా తో పాటుగా 1992 బ్యాచ్ కు చెంది న విజయానంద్‌, బుడితి రాజశేఖర్ రేసులో ఉన్నారు. విజయానంద్‌ వచ్చే ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనుండగా, సాయిప్రసాద్‌ 2026 మే లో, ఆర్పీ సిసోదియా 2028 జనవరిలో రిటైర్ కానున్నారు. ఈ లెక్కన ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్‌ ఉండటంతో పాటుగా ప్రభుత్వ సమీకరణాల మేరకు ఆయనకే సీఎస్ గా ఛాన్స్ దక్కుతుందని చర్చ సాగుతోంది. కానీ, సడన్ గా చంద్రబాబు మరో పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

సాయి ప్రసాద్ కే ఛాన్స్..?
ఐఏఎస్ సాయిప్రసాద్ ను నూతన సీఎస్ గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. 2014 లో నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాయి ప్రసాద్ ను ఏరి కోరి తన పేషీకి తెప్పించుకున్నారు. 2014-19 వరకు సీఎం పేషీలో కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత జగన్‌ హయాంలో కూడా సీసీఎల్‌ఏ, రెవెన్యూ స్పెషల్‌ సీఎస్ గా రెండు బాధ్యతలూ నిర్వహించారు. తొలి నుంచి సాయి ప్రసాద్ పని తీరు పైన నమ్మకం ఉండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో సాయి ప్రసాద్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+