హైదరాబాద్ లో మరో భారీ పెట్టుబడి.. 7వేల కోట్ల ఒప్పందం, యువతకు పండుగే!

హైదరాబాద్ లో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో హైదరాబాద్ మరోసారి ఆకర్షణీయమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆకర్షించింది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డేటా సెంటర్ సంస్థ CtrlS డేటా సెంటర్స్ లిమిటెడ్‌లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

రూ.7,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టనున్న CPP

మొత్తం రూ.7,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం భారతదేశంలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది.ఈ ఒప్పందం ప్రకారం, CPP ఇప్పటికే రూ.4,000 కోట్లు పెట్టుబడిగా ఇచ్చి CtrlS సంస్థలో 8.2 శాతం ఈక్విటీ వాటాను సాధించింది. ఈ లావాదేవీ సమయంలో CtrlS కంపెనీ ప్రీ-మనీ వాల్యుయేషన్ రూ.44,914 కోట్లుగా అంచనా వేయబడింది.

Investments in hyderabad Canada Pension Plan Investment Board to invest Rs 7 000 crore in Hyd

అత్యాధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ల ఏర్పాటు

మిగిలిన రూ.3,000 కోట్లను దేశవ్యాప్తంగా అత్యాధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌లను అభివృద్ధి చేయడానికి జాయింట్ వెంచర్ ద్వారా ఉపయోగించనున్నారు. ఈ భాగస్వామ్యం భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ డిమాండ్‌ను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. CtrlS వ్యవస్థాపకుడు మరియు CEO శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో AI మరియు క్లౌడ్ సేవల డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు.

CtrlS సంస్థ దేశవ్యాప్తంగా సేవల విస్తరణ ప్లాన్

అంతర్జాతీయ హైపర్‌స్కేలర్లు, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా మేము మరింత వేగంగా విస్తరించగలమని పేర్కొన్నారు. మొదటి హైపర్‌స్కేల్ క్యాంపస్‌ను నవీ ముంబైలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం CtrlS సంస్థ దేశవ్యాప్తంగా 4.4 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులపై పని చేస్తోందన్నారు.

హైదరాబాద్ శివార్లలో రెండు భారీ డేటా సెంటర్లు

రాబోయే ఐదేళ్లలో దాదాపు 5 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కంపెనీ తన కార్యకలాపాలను ప్రస్తుతం 11 నగరాల నుంచి 20-22 నగరాలకు విస్తరించనుందని వెల్లడించారు. హైదరాబాద్ శివార్లలోని చందన్‌వెల్లి మరియు ఫ్యూచర్ సిటీలలో వరుసగా 1.4 గిగావాట్లు, 2 గిగావాట్ల సామర్థ్యాలతో రెండు భారీ డేటా సెంటర్ క్యాంపస్‌లను నిర్మిస్తోందని చెప్పారు.

లూజ్ పన్నీర్ కొంటున్నారా? ఇది తెలిస్తే మీరు చచ్చినా బయట పన్నీర్ కొనరు!
లూజ్ పన్నీర్ కొంటున్నారా? ఇది తెలిస్తే మీరు చచ్చినా బయట పన్నీర్ కొనరు!

యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించనున్న సంస్థ

ఈ విస్తరణలో భాగంగా కంపెనీ ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 1,850 నుంచి 3,000 మందికి పెంచాలని యోచిస్తోంది. ఇది హైదరాబాద్‌లో యువతకు మంచి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఈ ఒప్పందం భారతదేశ డిజిటల్ ఎకానమీని మరింత బలోపేతం చేస్తుందని, హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+