గాదె సాయికృష్ణ ఘటన పై NHRC కి కేశినేని నాని ఫిర్యాదు...!!

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. నెల రోజులుగా ఆచూకీ లభించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన రాజకీయంగా ఆరోపణలు మొదలయ్యాయి. కృష్ణలంక సీఐ పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఐను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారం పైన విచారణకు ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ఈ ఘటన పైన జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయటం సంచలనంగా మారుతోంది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణపై గతంలో కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక అతను ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా, పాత కేసు విషయమై మే 9, 2026 న విజయవాడ కృష్ణలంకకు చెందిన ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసులు తీసుకెళ్లిన సాయికృష్ణ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అతన్ని ఏ కోర్టులోనూ హాజరుపరచకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో తాజా విచారణ నేపథ్యంలో ఒక్క సారిగా ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.

Kesineni Nani Approaches NHRC Over Alleged Illegal Detention of Gade Sai Krishna here the details

వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేసారు. కాగా.. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఇక.. ఈ వ్యవహారం పైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సాయికృష్ణ లాకప్ డెత్‌పై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందు గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో అక్రమ నిర్బంధం, హత్య పై సెక్షన్ (176)(1A) కింద తక్షణమే స్వతంత్ర విచారణ చేయాలని కేశినేని నాని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+