చంద్రబాబు కోసం ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలపై అరెస్టు చేయడంపై ఏపీలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం వైసిపి నిరంకుశ పాలనకు నిదర్శనమని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలి అనేది జగన్ లక్ష్యమని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.ఏపీలో మాత్రమే కాదు ఇటు తెలంగాణాలోనూ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు, హౌస్ అరెస్టులతో టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Senior lawyer Sidharth Luthra who will hear arguments in ACB court for Chandrababu!!

ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబును మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నారు. ఏసీబీ కోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి చంద్రబాబు కోసం వాదించనున్నారు.

సిద్ధార్థ లూద్రా ప్రస్తుతం ఆయన తన టీంతో కలిసి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. విజయవాడ ఎసిబి కోర్టులో ఆయన చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టుకు తరలింపు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా ఏసిబి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గతంలో ఎమ్మెల్సీని ఓటుకు నోటు కేసులో ప్రలోభాపెట్టేందుకు ప్రయత్నించారని చంద్రబాబుపై నమోదైన కేసులో చంద్రబాబు నాయుడు తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+