AP Elections: ఏపీ ఎన్నికలపై గోనె ప్రకాష్ రావు జోస్యం-ఎవరికి ఎడ్జ్ ? కూటమికి బీజేపీ చేటు !
ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రతి రోజూ పలు మీడియా సంస్ధలు, సర్వే ఏజెన్సీలు తమ అంచనాల్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో పలు సర్వేలు అధికార వైసీపీకి జై కొడుతుండగా.. మరికొన్ని విపక్ష ఎన్డీయే కూటమికే మొగ్గు ఉందని చెప్తున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేసిన వైఎస్సార్ సన్నిహితుడు గోనె ప్రకాష్ రావు తన అంచనాల్ని కూడా వెల్లడించారు.

ఏపీ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే గోనె ప్రకాష్ రావు ఇవాళ ఏపీ ఎన్నికలపై తన జోస్యం వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎన్డీయే కూటమికి 130 నుంచి 145 సీట్లు లభించే అవకాశం ఉందని గోనె ప్రకాష్ రావు తెలిపారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమికి 19 నుంచి 21 సీట్లు లభించే అవకాశం ఉందన్నారు. దీని వెనుక కారణాల్ని కూడా ఆయన విశ్లేషించారు.
ఏపీ ఎన్నికల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధించే అవకాశం ఉన్నా బీజేపీతో పొత్తు వల్ల కొంత మేర నష్టం కలగనుందని గోనె ప్రకాష్ రావు అంచనా వేశారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రమే వైసీపీకి మెజార్టీ సీట్లు రాబోతున్నట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50-60 వేల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. అయితే చివరి నిమిషంలో పవన్ ఎంపీగా కూడా వెళ్లే అవకాశం లేకపోలేదన్నారు. ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారన్నారు.












Click it and Unblock the Notifications