మత్తయ్య కాల్ డేటాకు టైమ్: చంద్రబాబుపై కోదండరామ్ వ్యాఖ్యలు
విజయవాడ/ కోదండరామ్: ఓటుకు నోటు కుంభకోణం కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య కాల్‌డేటా ఇచ్చేందుకు నెల రోజుల సమయం కావాలని సర్వీసు ప్రొవైడర్లు. ఆ మేరకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయస్థానం ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
నోటుకు ఓటు కేసు మాఫీ కోసమే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ సరిగా పనిచేయడం లేదని విమర్శిస్తున్నారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సెక్షన్ - 8 వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన అన్నారు.

బుధవారంనాడు రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సెక్షన్ 8లో అభ్యంతకరమైన రీతిలో అధికారాలను పొందుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అననారు. దాన్ని తమ జెఎసి ఖండిస్తోందని చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాదు ప్రశాంతంగా ఉందని, పరిస్థితి దిగజారితే గవర్నర్ తన విచక్షణాధికారాలను వినియోగించుకోవచ్చునని కోదండరామ్ అన్నారు.












Click it and Unblock the Notifications