వివేకా కేసులో భారీ ట్విస్ట్-సీబీఐకి హైకోర్టు షాక్-ఏ1 బెయిల్ రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు గతంలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ కేసులో సాక్ష్యుల్ని తీవ్రంగా బెదిరిస్తున్నట్లు సీబీఐ ఆరోపణలు చేసింది. ఈ కేసులో తాము జరుపుతున్న దర్యాప్తుకు ఇది అడ్డంకిగా మారుతోందని హైకోర్టుకు తెలిపింది. ఎర్ర గంగిరెడ్డికి గతంలో స్ధానిక కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయకపోతే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదించింది. అయితే ఈ వాదనలపై స్పందించిన హైకోర్టు. ఎర్ర గంగిరెడ్డి సాక్యుల్ని బెదిరించినట్లు, ప్రభావితం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీనికి సీబీఐ దగ్గర సమాధానం లేదు. దీంతో హైకోర్టు సీబీఐ పిటిషన్ ను కొట్టేసింది.

Recommended Video
వివేకా కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు తీరుపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ అనుమానిస్తున్న కొందరు సీబీఐ అధికారులపైనే పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు కోరింది. దీనిపై స్పందించిన ఎర్ర గంగిరెడ్డి న్యాయవాదులు.. సాక్ష్యుల్ని తమ క్లయింట్ బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఈ హై ప్రొఫైల్ కేసులో సీబీఐ దర్యాప్తు ఇప్పటివరకూ సాఫీగానే సాగుతోంది.కోర్టుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ విషయంలో మాత్రం తొలిసారి సీబీఐకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications