Yanamala: కాకినాడలో టీడీపీకి భారీ షాక్- యనమల గుడ్ బై ..!
ఏపీలో ఎన్నికల వేళ కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ నేతత యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ రేపట్లో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్న యనమల రామకృష్ణుడుతో విభేదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు తునిలో టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీకి పట్టున్న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజాకూ, యనమల రామకృష్ణుడు కుటుంబానికీ మధ్య ఎప్పటి నుంచో వార్ ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు ఎన్నికల్లో యనమల కుటుంబం నుంచి వైసీపీ నేత దాడిశెట్టి రాజా మీద పోటీ చేసిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ యనమల కుటుంబంలో విభేదాలు తారా స్ధాయికి చేరాయి. ఈసారి కృష్ణుడికి కాకుండా తన కుమార్తె దివ్యకు యనమల రామకృష్ణుడు తుని టికెట్ ఇప్పించుకున్నారు.

దీంతో ఆగ్రహంగా ఉన్న యనమల కృష్ణుడిని నేరుగా చంద్రబాబే పిలిపించి మాట్లాడారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తొలుత దివ్యకు సహకరించేందుకు సిద్ధమన్న కృష్ణుడు.. ఆ తర్వాత అన్న రామకృష్ణుడు తనను పిలిపించి మాట్లాడలేదని అలిగి దూరంగా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత దాడిశెట్టి రాజాతో టచ్ లోకి వెళ్లారు. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీడీపీని వీడుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. త్వరలో ఆయన వైసీపీ తీర్దం పుచ్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications