Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి..
ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు దుర్మణం చెందారు.
ఏపీలోని కాకినాడ జిల్లాలో విషాదం జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో నిర్మాణంలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు దుర్మణం చెందారు. ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తుండగా కార్మికులు జారి పడిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటగా ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి ముందు ఓ కార్మికుడు వెళ్లాడు. అతడు ప్రమాదవశాత్తూ పడిపోవడంతో మరికొందరు కార్మికులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక మొత్తం ఏడుగురూ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు కాగా.. మిగిలిన ఇద్దరిది పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారు.
పాడేరుకు చెందిన మృతులను కుర్రా రామారావు(45), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా తేల్చారు. పులిమేరుకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్, ప్రసాద్ ఉన్నట్లు గుర్తించారు.గురూ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులు ఉన్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications