ఏపీలో భారీగా బదిలీలు: కొందరికి నో పోస్టింగ్..
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మున్సిపాలిటీల్లో భారీ బదిలీలను చేపట్టింది. మొత్తంగా 24 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం కల్పించింది.
నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ పీ బాలాజీ ప్రసాద్.. ఆమదాలవలసకు బదిలీ అయ్యారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి పీ నల్లనయ్య విజయనగరానికి బదలీ అయ్యారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మల్లయ్య నాయుడికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎంఏయూడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట జే సురేంద్ర.. నర్సీపట్నానికి బదిలీ అయ్యారు. అక్కడున్న కమిషనర్ పీ రవిబాబుకు పోస్టింగ్ ఇవ్వలేదు. భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ శ్రీవిద్యను సామర్లకోటకు బదిలీ చేశారు. అక్కడున్న జే రామారావును మాతృసంస్థ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పంపించారు.
అమలాపురం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-1గా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో పని చేస్తోన్న కేవీవీఆర్ రాజును అపాయింట్ చేశారు. అక్కడున్న ఎస్ మనోహర్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. వినుకొండ మున్సిపాలిటీ అసిస్టెంట్ డైెరెక్టర్ టీఎల్‌పీఎస్ఎస్ కృష్ణవేణిని నిడదవోలుకు బదిలీ చేశారు. అక్కడున్న టీ రామ్‌భూపాల్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వలేదు.
ఆదోని మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డిని భీమవరానికి బదిలీ చేశారు. అక్కడున్న ఎం శ్యామలను ఆమె మాతృసంస్థ పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపించారు. వెయిటింగ్‌లో ఉన్న ఏ భానుప్రతాప్‌ను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు.
మాచర్ల మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణ బాబు నందిగామకు బదిలీ అయ్యారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డిని పొదిలికి బదిలీ చేశారు. అలాగే- బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు.
శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పొన్నూరుకు బదిలీ అయ్యారు. అక్కడున్న సీఎంఏ నయీం అహ్మద్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పొన్నూరుకు బదిలీ అయ్యారు. అక్కడున్న సీఎంఏ నయీం అహ్మద్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు.
చిత్తూరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కే చెన్నయ్యకు గురజాల కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. అక్కడున్న ఏ మోహన శ్రీనివాసరావును హిందూపురం మున్సిపాలిటీ మేనేజర్‌గా రీప్యాట్రియేట్ చేశారు. సత్తెనపల్లి రెవెన్యూ ఆఫీసర్ ఎంవీ అప్పారావుకు దాచేపల్లి కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. అక్కడున్న డీవీఎస్ నారాయణరావును విజయవాడ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా రీప్యాట్రియేట్ చేశారు.
పిడుగురాళ్ల రెవెన్యూ ఆఫీసర్ పీ శ్రీధర్‌ను అక్కడే మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. అక్కడున్న బీఎస్ గిరి కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. విజయవాడ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం సుభాష్ చంద్రబోస్‌ను వినుకొండ కమిషనర్ బదిలీ చేశారు. నర్సాపురం మున్సిపల్ కమిషనర్ కే వెంకటేశ్వరరావును ఒంగోలుకు బదిలీ చేశారు. అక్కడున్న ఎం జశ్వంత్ రావుకు పోస్టింగ్ ఇవ్వలేదు.
మాచర్ల మున్సిపల్ కమిషనర్ డీ వెంకట దాస్ గిద్దలూరుకు బదిలీ అయ్యారు. తెనాలి అసిస్టెంట్ కమిషనర్ కే అనూష.. కందుకూరుకు బదిలీ అయ్యారు. అక్కడున్న కేవీ కృష్ణారెడ్డిని కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు రీప్యాట్రియేట్ చేశారు. ముమ్మడివరం కమిషనర్ కే వెంకట్రామిరెడ్డి ఆళ్లగడ్డకు బదిలీ అయ్యారు. అక్కడున్న ఏవీ రమేష్ బాబు కర్నూలుకు రీప్యాట్రియేట్ అయ్యారు.
విజయవాడ జోనల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ తాడిపత్రికి బదిలీ అయ్యారు. అక్కడున్న ఎం రామ్మోహన్ రావుకు పోస్టింగ్ ఇవ్వలేదు. కర్నూలు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ వీ దివాకర్ రెడ్డి రాయదుర్గానికి బదిలీ అయ్యారు. అక్కడున్న పీ కిశోర్‌ను కడపకు రీప్యాట్రియేట్ చేశారు.
బద్వేలు మున్సిపల్ కమిషనర్ ఎస్ వంశీకృష్ణ భార్గవ.. కల్యాణదుర్గానికి బదిలీ అయ్యారు. అక్కడున్న బీవీ నర్సారెడ్డి పోస్టింగ్ ఇవ్వలేదు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలనాధికారి వీవీ నరసింహారెడ్డిని బద్వేలుకు బదిలీ చేశారు. అక్కడున్న ఎం కృష్ణకు పోస్టింగ్ ఇవ్వలేదు. తాడేపల్లిగూడెం అసిస్టెంట్ కమిషనర్ ఎం గోపాలరావును పెడనకు బదిలీ చేశారు. అక్కడున్న బీ వెంకటరామయ్యకు పోస్టింగ్ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications