నిన్న భీమవరం.. నేడు విజయవాడ: స్పా పేరుతో సెక్స్ దందా; స్పెషల్ ప్యాకేజీలు కూడా!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, భీమవరం ఇలా అనేక చోట్ల స్పా పేరుతో వ్యభిచార దందా కొనసాగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మసాజ్ ముసుగులో హైటెక్ వ్యభిచారం కొనసాగుతుందని గుర్తించిన పోలీసులు ఇప్పటికే అనేక స్పాల పై దాడులు చేసి హైటెక్ గ్యాంగుల గుట్టు రట్టు చేస్తున్నారు.

విజయవాడలో స్పా ముసుగులో వ్యభిచార దందా .. షాక్ అయిన పోలీసులు
ఇక తాజాగా విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో గురునానక్ కాలనీ లో ఉన్న కే స్టూడియో స్పా లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేసి అక్కడ జరుగుతున్న దందాను గుర్తించారు. పోలీసులు మారువేషంలో స్పా కు వెళ్లి అమ్మాయిల కోసం బేరసారాలు చేశారు. ఇక పోలీసుల ట్రాప్ లో పడిన నిర్వాహకులు అన్ని విషయాలు, ఇస్తున్న ఆఫర్లు చెప్పారు. వ్యభిచారం నిర్వహించడానికి అక్కడ నిర్వాహకులు చేస్తున్నదంతా చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిల ఫోటోలను చూపించి స్పెషల్ ప్యాకేజీ లు ఆఫర్ చేసి యువకులను ఆకర్షిస్తున్నట్లుగా గుర్తించారు.

పట్టుబడిన ఎనిమిది మంది వ్యభిచారం చేస్తున్న మహిళలు, ముగ్గురు విటులు
ఇక ఆపై పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు స్పా పై దాడులకు దిగారు పోలీసులు. ఈ దాడులలో మొత్తం ఎనిమిది మంది వ్యభిచారం చేస్తున్న మహిళలు, ముగ్గురు విటులు పట్టుబడ్డారు. ఇక స్పా కోసం వచ్చిన వారిని ఆకట్టుకోవడానికి అమ్మాయిలు ముందుగా వారితో మాట కలుపుతారని, ఆ తర్వాత నిదానంగా వారిని ట్రాప్ లోకి దింపుతారని, అప్పుడే అసలు వ్యవహారం బయట పెడతారని, అవసరం అనుకుంటే అక్కడ ఉన్న యువతులను డేట్ పై బయటకు తీసుకు వెళ్లడానికి కూడా అంగీకరిస్తారని పోలీసులు గుర్తించారు.

వారం వారం భారీ ప్యాకేజీ క్రింద పక్క రాష్టాల మహిళలతో వ్యభిచార దందా
వారం వారం ప్యాకేజీ కింద ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తూ, ఇతర రాష్ట్రాలలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలను యువతులను టార్గెట్ చేసి స్పా సెంటర్ పేరుతో ఇటువంటి అశ్లీల దందాకు తెర తీశారని పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చాలామంది ఈ వ్యభిచార ముఠా ట్రాప్ లో పడి ఈ దందాలో ఇరుక్కుపోయారు. ఇక స్థానికులు వీరిపై ఫిర్యాదు చేయడంతో పక్క ఆధారాల కోసం విటుడిగా మారువేషంలో వెళ్లిన పోలీసు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆపై దాడులు చేసి ఈ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.

భీమవరంలోనూ స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
ఇదిలా ఉంటే మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో కూడా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఏ నైన్ బ్యూటీ సెలూన్ స్పా పై దాడులు నిర్వహించిన ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళతో పాటు ఏడుగురు మహిళలను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా పోలీసులకు పక్కా సమాచారం అందటం తోనే దాడులు చేసినట్టు సమాచారం. వీరి నుండి 31,500 రూపాయలు నగదు, చెక్కు బుక్కు, స్వైపింగ్ మిషన్ లను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల స్పా ముసుగులో వ్యభిచార దందా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా స్పా లపై దృష్టిసారిస్తున్నారు. వ్యభిచార గ్యాంగులను పట్టుకునే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications