సెక్స్ రాకెట్ రట్టు: జూనియర్ ఆర్టిస్ట్‌తో పాటు ఇద్దరు గర్ల్స్

హైదరాబాద్: హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న గదులపై పంజాగుట్ట పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిర్వాహకులు పరారులో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు.

అతను ఇద్దరితో కలిసి యువతులను తెప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హోటళ్లలో వ్యవహారం చక్కబెడుతూ ఫోన్‌ల ద్వారా అక్కడికే విటులను రప్పించేవారు. సమాచారం మేరకు శుక్రవారం రాత్రి అమీర్‌పేటలోని ఓ హోటల్ గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అతనితో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఎస్ఓటి, ఎల్బీనగర్ పోలీసులు గురువారం ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. ఇళ్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎస్‌ఓటి, ఎల్‌బినగర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దాడిలో నిర్వాహకుడితోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

sex rocket busted in hyderabad on Friday

పట్టుబడిన విటుల్లో సీరియల్ నటుడు వై శ్రీనివాస్‌తోపాటు ముగ్గురు యువతులు ఉన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నాగోల్ కో-ఆపరేటివ్ కాలనీ, రోడ్ నెంబర్ 14, ఫ్లాట్ నెంబర్ సి-17 ఇంటిలో గత కొంతకాలంగా వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో శుక్రవారం ఎస్‌ఓటి, ఎల్బీ నగర్ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడిలో విటులు టివి సీరియల్ నటుడు వై శ్రీనివాస్ (41), ఎ శ్రీనివాస్, డి రామకృష్ణ, బి గణేష్, నిర్వాహకుడు శంకర్‌లతోపాటు మరో ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+