బాలికలపై అఘాయిత్యం: వెలుగు చూసిన ఫాస్టర్ రాసలీలలు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగం: బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ ఫాస్టర్ వ్యవహారం విజయనగరం జిల్లాలో బయటపడింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

గ్రామంలోని వైట్ హౌస్ చిల్డ్రన్ హోం నిర్వాహకుడి రాసలీలలను అక్కడ ఉన్న బాలికలు సోమవారం బయటపెట్టారు. గత కొన్నాళ్లుగా తమను హోం నిర్వాహకుడు ప్రసాదకుమార్ లైంగికంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు.

అతనితో పాటు అతని కొడుకు

అతనితో పాటు అతని కొడుకు

నిర్వాహకుితోపాటు ఆతని కుమారుడు షారున్ కూడా లైంగికదాడులకు పాల్పడుతున్నాడని బాలికలు సోమవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ప్రసాదకుమార్ కొన్నేళ్లుగా గ్రామంలో అనాధ పిల్లల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. 19మంది గిరిజన బాలికలు ఇక్కడ ఉంటూ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.

 పలాయం చిత్తగించిన నిర్వాహకుడు

పలాయం చిత్తగించిన నిర్వాహకుడు

లైంగికదాడి విషయం బయటపడటంతో ప్రసాదకుమార్ పలాయనం చిత్తగించాడు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వైట్ హౌస్ అనాధ పిల్లల ఆశ్రమాన్ని ఆయన నడుతున్నట్లు సీఐ సంజీవిరావు, ఎస్‌ఐ సన్యాసినాయుడు జరిపిన ప్రాథమిక విచారణ వివరాలు విలేఖరులకు తెలియజేశారు.

సంఘటనపై సిఐ ఆరా

సంఘటనపై సిఐ ఆరా

ఈ సంఘటనపై సాలూరు సీఐ సంజీవరావు సోమవారం వివరాలు సేకరించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం - మామిడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పాఠశాలకు రాకపోవడంపై ఉపాధ్యాయులు సోమవారం ఆరా తీశారు. ఆమె అక్కడే చదువుకుని సమీపంలోని హాస్టల్‌లో ఉంటోంది. అయితే ఆమె సంక్షేమం చూస్తున్న ఫాదరే సాలూరు తీసుకెళ్లి తన వద్ద ఉంచినట్టు, ఆమెకు ఆరోగ్య సమస్య రావడంతో తల్లిదండ్రులను రప్పించి ఆస్పత్రికి పంపించినట్టు తెలిసింది.

 మీడియా ముందుకు బాలికలు..

మీడియా ముందుకు బాలికలు..

బాలిక విషయం బయటపడడంతో వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాకు బాలికతో పాటు మరికొంత మంది కలసి తమపై జరుగుతున్న వేధింపులపై వివరించారు. ఫాదర్‌, అతని కొడుకు తమ పట్ల ప్రవర్తించిన తీరును వివరించారు. పాచిపెంట ఎస్‌.ఐ సన్యాసిరావు, ఆ తర్వాత సాలూరు సీఐ సంజీవరావు మామిడిపల్లి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటున్న ఎనిమిది మంది బాలికలను మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Children's Home organiser has sexually assualted on girls at Saluru in Vijayanagara district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి