తల్లిదండ్రుల పక్కలోంచి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
హైదరాబాద్: ఓ కామాంధుడు అత్యంచ నీచ కార్యానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రుల పక్కలో పడుకున్న నాలుగేళ్ల బాలికను భవనం మూడో అంతస్థులోకి ఎత్తుకెళ్లి ఆమపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన హైరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ల్‌బినగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - ఎల్‌బినగర్‌లోని డివిఎం కళాశాల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. డివిఎం కళాశాలకు సమీపంలో జాతీయరహదారిపై నూతనంగా బహుళ అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోంది. మెదక్‌జిల్లా ఆంధోల్ మండలం కిచ్చిరపల్లి గ్రామానికి చెందిన ఎన్. ఈశ్వర్, నాగమణి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఇదే అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా ఉంటూ జీవిస్తున్నారు.

గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఈశ్వర్ కూతురు నాలుగేళ్ల బాలికను అపార్ట్‌మెంట్ పై అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు. భయపడిన బాలిక గట్టిగా కేకలు వేయగా బాలికను వదిలిపెట్టి వారు పారిపోయారు. వెంటనే బాలికను హాస్పిటల్‌కు తరలించి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న ఎల్‌బినగర్ డిసిపి విశ్వప్రసాద్, ఏసిపి సీతారామ్, సిఐ శ్రీనివాస్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాలిక తల్లిదండ్రులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాలికపై అత్యాచారానికి ఓడిగట్టింది ఒక వ్యక్తేనా, మరింత మంది ఉన్నారా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications