అత్యాచార యత్నం చేసి మహిళకు నిప్పంటించారు

Sexual assault against a woman in Secunderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఆనుకుని ఉన్న సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో నిరుపయోగంగా పడిఉన్న క్వార్టర్స్‌లో బుధవారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై కొందరు దుండగులు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఆమె ఎదురుతిరగడంతో దుండుగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు.

మంటలకు తాళలేక ఆమె రోదిస్తూ, రోడ్డుపై పడిపోయింది. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం మహిళను 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై స్థానికులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది. నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టపగలే ఈ దారుణం జరగడంతో తీవ్ర కలకలం చెలరేగింది.

బాలికలపై సోదరుడి అఘాయిత్యం

ఇద్దరు బాలికలపై వరుసకు సోదరుడే కిరాతకానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం నర్సంపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంట తండాకు చెందిన ఇద్దరు గిరిజన బాలికలు(16, 17) కల్వకుర్తిలోని రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.

సంక్రాంతి సెలవులకు తండాకు వచ్చిన వారు, ఈ నెల 22న తిరిగి కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరారు. ఆమనగల్లు బస్టాండుకు చేరుకున్న వారిని వరుసకు సోదరుడు అదే తండాకు చెందిన యువకుడు (22) వారికి మాయమాటలు చెప్పి జీపులో ఎక్కించుకొని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఐదు రోజుల పాటు నిర్బంధించి, అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరకు సోమవారం హైదరాబాద్‌లో బస్సు ఎక్కించి కల్వకుర్తికి పంపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+