ఇన్ని వేధింపులా?: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విజయవాడ: ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ గాంధీ మహిళా కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అనిత అనే విద్యార్ధిని బుధవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డింది.

ఆడపిల్లగా పుడితే ఇన్ని వేధింపులు భరించాలా...? అంటూ ఆ విద్యార్ధిని తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

sexual harassment: A girl student allegedly committed suicide

ఆమెను వేధింపులకు గురిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు వీధుల్లోని, కళాశాల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఏమైనా వేధించారా? లేక ఎవరైనా యువకులు ప్రేమ వేధింపులకు గురిచేశారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

అసభ్య ప్రవర్తన కేసులో ఒకరికి ఏడాది జైలు

రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి యామిని మంగళవారం తీర్పు చెప్పారు.

బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌(40) 2011 డిసెంబర్‌ 03 తమినాడ్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగిలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ(25) నిద్రిస్తున్న సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో సహ ప్రయాణికులు అతడ్ని పట్టుకుని విజయవాడ రైల్వే పోలీసులు అప్పగించారు.

అతనిపై మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసు నమోదు చేసి అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితునిపై నేరారోరపణ రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షను ఖరారు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+