ఫీజుల దందాపై పల్లె రఘునాథ్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ హెచ్చరిక:సిఎం పర్యటన అడ్డుకుంటాం!
అనంతపురం:విద్యను వ్యాపారం చేస్తూ కరువు జిల్లా అనే కనికరం లేకుండా అనంతపురంలో ఫీజుల దందా చేస్తున్న టిడిపి నేత పల్లె రఘునాథ్ రెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నేత ఈశ్వర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి విద్యాసంస్థలలో ఫీజుల దందాని అరికట్టాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టానుసారంగా ఫీజుల దందా చేస్తున్న విద్యా సంస్థలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ తన విద్యా సంస్థల కోసమే పని చేస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ రఘునాథ్ రెడ్డిపై కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

లేని పక్షంలో ఆగస్టు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఈశ్వర్,మూర్తి , మనోహర్, నారాయణ స్వామి, బాలాజీ , చిన్న, బాబు పాల్గొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications