వెంకయ్య ఆంధ్రకే మంత్రా?: షబ్బీర్, కెసిఆర్‌పై జీవన్ ఫైర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపి సిఎం చంద్రబాబునాయుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంటే.. తెలంగాణ సిఎం కెసిఆర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రి ఉన్న వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం 54శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం కెసిఆర్ ప్రశ్నించకపోవడం సరికాదన్నారు.
రబీలో వ్యసాయానికి ఎన్నిగంటలు ఇస్తారో రైతులకు స్పష్టం చేయాలని కెసిఆర్ సర్కారును ఆయన డిమాండ్ చేశారు. కరెంటు కోతలతో ఖరీఫ్ పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కెసిఆర్‌పై ధ్వజమెత్తిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలంగాణ సిఎం కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కెసిఆర్ విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని కెసిఆర్ సర్కారు మరిచిపోయిందని ఆరోపించారు.
ప్రభుత్వం ఇలా మొక్కుబడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే.. కెసిఆర్ కాదు కాదా ఆయన మనవడి తరంలో కూడా కేజీ టు పీజీ పథకం హామీ అమలు కాదని ఎద్దేవా చేశారు. విద్యా హక్కు చట్టాన్ని కూడా కెసిఆర్ నీరుగారుస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications