రాష్ట్ర విభజన చంద్రబాబు వల్లే: శైలజానాథ్, హోదాపై ప్రశ్న
చిత్తూరు/ గుంటూరు : రాష్ట్ర విభజనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ముఖ్య కారణమని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భిక్షం వేయాలని అడగడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీనే నెరవేర్చాలంటున్నామని ఆయన అన్నారు. ఈనెల 8న తిరుపతిలో జరుగనున్న పోరుసభ వాల్‌పోస్టర్‌ను శైలజానాథ్ విడుదల చేశారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీ లోపు ప్రత్యేక హోదా ప్రకటించాలని రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈలోగా ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరాకపోతే 11వ తేదీన ఏపీ బంద్ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications