శమంతకణితో వివాదం: శైలజానాథ్ యూటర్న్

తాను కాంగ్రెసు తరఫున నామినేషన్ వేశానని, కాంగ్రెసు అభ్యర్థిగానే పోటీలో ఉంటానని శైలజానాథ్ చెప్పారు. ఆయన శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ శమంతకమణితో శైలజానాథ్‌కు వాగ్వివాదం జరిగింది.
తెలుగుదేశం పార్టీ తరఫున తన కూతురు యామిని చేత నామినేషన్ వేయడానికి శమంతకమణి వచ్చారు. ఆ సమయంలోనే శైలజానాథ్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చివరి వరకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications