వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరాధార వార్తలకు సిగ్గు పడాలి.. కియా తరలింపు వార్తలపై మండిపడ్డ రోజా

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ తరలిపోతుందని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించటం ఏపీలో ప్రకంపనలు రేపింది . ఈ కథనాలపై ఏపీ సర్కార్ కూడా క్లారిటీ ఇచ్చింది. కియా మోటార్స్ తరలిపోతుంది అని రాయిటర్స్‌ ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, అసత్యాలతో కూడిన కథనమని పరిశ్రమలు,వాణిజ్యం,పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ చెప్పారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని.. ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ మంత్రులు, నేతలు కూడా కియా తరలింపు వార్తలను ఖండిస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ వార్తపై , అలాగే కియా తరలింపు ప్రచారంపై మండిపడ్డారు. మీడియాలో వస్తోన్న వార్తలు అసత్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్న రాయిటర్స్ ఇండియా సిగ్గుపడాలని ఆమె ఘాటుగా విమర్శించారు . వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తోన్న జర్నలిస్టులను చూసి షాక్ అవుతున్నాను అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Shame on the baseless news.. Roja furious over the Kia eviction news

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందంటూ రాయిటర్స్ ప్రచురించిన కథనం విపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించే ఆయుధం అయ్యింది. రాష్ట్రం నుంచి కియా తరలిపోతోందంటే రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే అని టీడీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుంది . ఇక అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు టీడీపీ విమర్శలను , కియా తరలింపు వార్తలను తిప్పి కొట్టే యత్నం చేస్తున్నారు.

English summary
Nagari YCP MLA and APIIC Chairman Roja outaged on Kia motors eviction news. YCP MLA Roja was furious over the news as well as the Kia eviction campaign. She said the news in the media was not true. She criticized Reuters India for being ashamed of the false information about the Kia Motors project in Andhra Pradesh. She tweeted that she was embarrassed to see journalists promoting such baseless material in the name of news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X