కిరణ్ జైలుకే: శంకరన్న, అందరిలానే చంద్రబాబు: గంటా

అధికారం కోసమే పార్టీ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు బయటకు పోతున్నారంటూ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. విమర్శలు చేయడం మానుకుని ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు పోతున్నారో గ్రహించి సమస్య మూలాలను పరిష్కరించేలా చేయడం నాయకత్వం పనని హితవు పలికారు.
తాము గతంలోనే రాజీనామా చేసినా విభజన బిల్లును ఓడించాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ఉపసంహరించుకున్నామని తెలిపారు. ప్రజల అనుగ్రహం ఉంటే పెద్ద పదవులే లభిస్తాయని తనకు ప్రజలే హైకమాండ్ అని అన్నారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు పిసిసి చీఫ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు ఎవరికి బుద్ధి చెబుతారో బొత్స వేచి చూడాలన్నారు.
తాను టిడిపిలోకి వెళ్తానన్న ప్రచారంపై అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని గంటా ధ్వజమెత్తారు. తన కుమార్తె వివాహానికి అన్ని పార్టీల నేతలూ వచ్చారని చంద్రబాబు వచ్చినంత మాత్రాన తాను టిడిపిలోకి వెళ్తున్నానంటే ఎలా అని గంటా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications