జగనన్న కోస త్యాగం: తెలంగాణలో షర్మిల ప్రచారం

Sharmila to be YSRC star campaigner in Telangana
హైదరాబాద్: జగనన్న కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల మరో త్యాగం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలంగాణలో ప్రచారం చేయడానికి ఆమె పరిమితమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు ప్రచార సారథ్య బాధ్యతలను ఆమె చేపట్టనున్నట్లు సమాచారం.

వైయస్ జగన్, వైయస్ విజయమ్మ సీమాంధ్రపై దృష్టి కేంద్రకరిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రాల్లో ప్రచార వ్యూహం రూపకల్పనపై వైయస్ జగన్ గురువారంనాడు పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.

తెలంగాణ బాధ్యతలు మొత్తం షర్మిల భుజాలపై మోపుతారని, ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తారని అంటున్నారు. అయితే, నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఆమె ఎప్పుడు ప్రచారం ప్రారంభిస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు.

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు 104 శాసనసభా స్థానాలకు 13 లోకసభ స్థానాలకు పోటీ చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో 117 శాసనసభా స్థానాలు, 19 లోకసభ స్థానాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+