ప్రభాస్‌ని చూడనే లేదు: వైఎస్ షర్మిల ఆవేదన, ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్లలో, పలు వెబ్‌సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పిఏసి సభ్యుడు డిఏ సోమయాజులు శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి అందజేశారు.
తాను చేస్తున్న ఈ ఫిర్యాదు కేవలం తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే కాదని, తాను రాస్తుననది.. సమాజంలోని ప్రతి తల్లి, చెల్లి, భార్య, ప్రతి బిడ్డ గౌరవానికి సంబంధించినదని షర్మిల పేర్కొన్నారు. ఎవరో అకారణంగా మోపుతున్న అభాండాలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఏ మహిళకైనా దుర్భరమైన విషయమని, చాలామందిలాగే తనను కూడా కొందరు లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల విషయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి నేటి రాజకీయాలు పడిపోయాయన్నారు. ''సినీ నటుడు ప్రభాస్‌కు ముడిపెడుతూ ఇంటర్నెట్‌లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. నేనింత వరకు ప్రభాస్‌ను కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడనైనా చూడలేదు... నా గౌరవ మర్యాదలు దెబ్బతీసే దుర్మార్గమైన లక్ష్యంతో అత్యంత క్రూరమైన రీతిలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నేనొక వాస్తవాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. వందలాది వెబ్ సైట్లలో కొనసాగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారంటే ఈ వదంతులు నిరాధారమైనవని, వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు' అని షర్మిల పేర్కొన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications